ఉద్యోగాల పేరిట మోసగిస్తున్నారు: కిషన్
హైదరాబాద్, నవంబర్ 30 : నాడు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, నేడు కిరణ్ నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట మోసగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిరుద్యోగ సమస్యపై బుధవారం బీజేపీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. గతంలో రాజీవ్ ఉద్యోగశ్రీ కింద 2 లక్షల ఉద్యోగాలిస్తామ ని వైఎస్ ప్రకటించి మోసగించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కిరణ్‌కుమార్ కూడా 15 లక్ష ల ఉద్యోగాలిస్తామని మభ్యపెడుతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం చలో అసెంబ్లీ చేపడుతున్నట్లు ఆ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
కరువుపై స్పీకర్ జోక్యం చేసుకోవాలి: దత్తాత్రేయ
కరువు కోరల్లో చిక్కిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని బీజేపీ సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ అన్నారు. కరువు పరిస్థితులపై స్పీకర్ జోక్యం చేసుకోవాలన్నారు.

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/dec/1/main/1main23&more=2011/dec/1/main/main&date=12/1/2011
No comments:
Post a Comment