Wednesday, February 15, 2012

జీతాలు పెరిగాయి



జీతాలు పెంచమని గొడవ చెయ్యలేదు. సమ్మె చెయ్యలేదు, ధర్నా లేదు, నిరసన లేదు, నిరాహార దీక్ష లేదు. అయినా జీతాలు పెరిగాయి, ఎంత పెరిగిందండీ అంటే వంద శాతం పైమాటే! నమ్మశక్యంగా లేదు కదూ! ఉండదు కాని నిజమే. ఈ "వేతన సవరణ" జరిగింది. లక్షీకటాక్షం ఎప్పుడూ శ్రీమంతులకే ఉంటుంది అన్న లోకోక్తి నిజమేననిపిస్తుంది. జనవరి 30, సోమవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో వేతన సవరణకు మంత్రివర్గ ఆమోదం లభించింది. జీతాలు పెరిగినవి. మంత్రులకు, ముఖ్యమంత్రికి నెలకు లక్షకు పైచిలుకుగా ఉన్న వేతనాలు రెండు లక్షలకు పెరిగాయి.

పాలకాస్సమస్తాః సుఖినోభవంతు 
 
 http://www.lokahitham.net/2012/02/blog-post.html

No comments:

Post a Comment