మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్య
ఈ మధ్య మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గుజరాత్ లో జరిగిన ఒక కార్యక్రమంలో "పాలన - ప్రజా సేవ" అంశంపై ఉపన్యసించారు. ప్రపంచంలో ఏ దేశంలో నైనా మంచి నాయకత్వం ఉంటే ఆ దేశం అభివృద్ధి సాధించగలదు, అలాగే సమస్యలను ఎదుర్కొనటానికి, పరిష్కరించేందుకు ధైర్యంగా సిద్ధపడుతుంది. గతంలో పనిచేసిన పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పాయ్ సరియైన నాయకత్వం వహించారు, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి వెనకాడలేదు. దానితో దేశంలో, అంతర్జాతీయంగా ప్రాముఖ్యతను సంపాదించుకొన్నారు.
గుజరాత్ లో నరేంద్ర మోడి కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసము సరియైన ప్రణాళికలు రచించటమే కాదు, వాటిని అమలు చేస్తున్నారు. ఈ మధ్య గుజరాత్ ప్రభుత్వం "గ్రామాలకు వ్యవసాయ సంబంధమైన సరియైన సమాచారము అందించటం, వ్యవసాయ భూములను పరిశీలించటం, భూసారమును ఆరోగ్యవంతంగా ఉంచటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, సేంద్రియ వ్యవసాయము మొదలైన అంశాలను పరిశీలించి తగు సూచనలు చేయటం ఒక ఉద్యమంగా తీసుకొంది. "కృషి మహోత్సవం" పేరుతొ తీసుకొన్న ఈ కార్యక్రమం రాష్ట్రంలోని 18000 గ్రామాలకు పాలనా యంత్రాంగము, సుమారు లక్షమంది ఉద్యోగస్తులు గ్రామాలకు కదిలారు. ముఖ్యమంత్రి నుండి వ్యవసాయ శాస్త్రవేత్తలు, తాలూకా స్థాయి ఉద్యోగస్తులందరూ కదిలారు. ఇది ప్రభుత్వం యొక్క పటిష్ట పాలనకు గుర్తింపు. గుజరాత్ ప్రభుత్వం e - పాలనకూడా ప్రవేశపెట్టింది. అన్ని స్థాయిలలో పారదర్శకమైన పాలనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటానికి అది ఉపయోగపడుతున్నది. ఈ దేశంలో సి.సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.స్వామినాధన్, బి.శివరామన్, ఆకుపచ్చ విప్లవం సృష్టించారు. డిల్లీ మెట్రో చీఫ్ బి.శ్రీధరన్ లాంటి అనేకమంది వాళ్ళ క్షేత్రంలో సరియైన నాయకత్వం అందించారు" అని అబ్దుల్ కలాం కొనియాడారు.

http://www.lokahitham.net/2011/12/blog-post_208.html
No comments:
Post a Comment