హైదరాబాద్, నవంబర్ 16 : రాష్ట్రంలో కరువు బారిన పడిన రైతులను తక్షణమే ఆదుకోవాలని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి బుధవారం ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి, రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. తీవ్ర వర్షాభావంతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి అన్నదాతలు నైరాశ్యంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లు వ్యవసాయోత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను విధించిందని తెలిపారు. తక్షణమే వ్యాట్‌ను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాభావంతో పంట నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరాకు రూ.10 వేలు నష్ట పరిహారం చెల్లించాలని, రబీ పంట సాగుకు వంద శాతం రాయితీపై విత్తనాలు అందజేయాలని డిమాండ్ చేశారు.
అలాగే, రైతులు పండించే అన్ని పంటలకు లాభసాటి ధరలను ప్రకటించాలని, వరి ధాన్యానికి క్వింటాకు రూ.200 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పసుపు రైతుల సమస్యలపై ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, నిజామాబాద్ జిల్లా పార్టీ నేతలతో కలిసి సీఎం కిరణ్‌కు వినతి పత్రం అందజేశారు

No comments:
Post a Comment