కాన్ఫరెన్స్ హాళ్లు, రెస్టారెంట్లు, కాటేజీలు, వెల్‌నెస్ జోన్ (హెల్త్ స్పా, రిసార్ట్స్, యోగ, ధాన్యం, స్విమ్మింగ్ పూల్స్, హెర్బల్ గార్డెన్), ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ (మినీ గోల్ఫ్ కోర్సు, క్రాఫ్ట్ విలేజ్)తో పాటు సాధారణ మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. ఆ మేరకు అభివృద్ధి చేసినందుకు 33 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఈ మేరకు తొలి సంవత్సరం రూ. 1.11 కోట్లు చెల్లిస్తానని, ప్రతి రెండేళ్లకు 10 శాతం చొప్పున పెంచుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందిన కంపెనీ ‘అధిక మొత్తానికి టెండర్లు’ దాఖలు చేసింది. 20 సంవత్సరాల తర్వాత నుంచి 33 సంవత్సరం వరకు అధిక మొత్తం లీజు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో అధికమొత్తం కోట్ చేసిన ఆ కంపెనీకి ద్వీపాన్ని అప్పగించాలని ఏపీటీడీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు ఒకట్రెండు రోజుల్లో జీవో కూడా వెలువడనుందని అధికార వర్గాల సమాచారం. అయితే 33 సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలనడమే తప్ప ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పుడు పూర్తి చేయాలనే నిబంధన ఏమీ లేకపోవడం గమనార్హం. కొద్దిపాటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి భారీగా వ్యాపారం చేసుకొన్నా లాభాల్లో వాటా అడిగే హక్కును ఏపీటీడీసీ కోరకపోవడం అనుమానాలకు తావిస్తోంది. టెండర్లలో పేర్కొన్న విధంగా మౌలిక సదుపాయాలు కల్పించకుండా తూతూమంత్రం సౌకర్యాలతో 33 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకొని కాంట్రాక్టర్ వెళ్లిపోయినా ప్రశ్నించే హక్కు ఏపీటీడీసీకి లేకపోవడం గమనార్హం. ఉద్యోగుల్లో వ్యతిరేకత: ప్రస్తుతం భవానీ ద్వీపంలో 24 గదులు, రెండు రెస్టారెంట్లు, సమావేశ మందిరం, మూడు చెట్ల మీద కుటీరాలు, ఓపెన్ ఎయిర్ థియేటర్, బోటింగ్ జట్టీలు.. తదితర సౌకర్యాలున్నాయి. సరాసరిన 70 శాతం ఆక్యుపెన్సీతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మరికొన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య, ఆదాయం పెరిగే అవకాశమున్న ద్వీపాన్ని కేవలం రూ.1.11 కోట్ల లీజుకు ప్రైవేటు సంస్థకు అప్పగించడంపట్ల ఉద్యోగులు వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. అయితే మంత్రుల సాధికార కమిటీ ఆమోదంతోనే భవానీ ద్వీపం ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచామని, తమ పాత్ర పరిమితమేనని ఏపీటీడీసీ అధికార వర్గాలు తెలిపాయి. |
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=260171&Categoryid=1&subcatid=33
No comments:
Post a Comment