అయోధ్య, నవంబర్ 17: ఉత్తరప్రదేశ్ నుంచి ప్రజలు బిచ్చగాళ్లలాగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారంటూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజలకే అవమానకరమని బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కారి అన్నారు. ‘ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇతర రాష్ట్రాలకు బిచ్చగాళ్లలాగా వెళ్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజలకే అవమానం’ అని గడ్కారీ బిజెపి నాయకులు రాజ్‌నాథ్ సింగ్, కల్‌రాజ్ మిశ్రాలు రాష్ట్రంలో చేపట్టిన జన స్వాభిమాన్ యాత్రలు ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప్ సంగ్రామ్ సభలో మాట్లాడుతూ గడ్కారీ అన్నారు. గత సోమవారం ఫూల్‌పూర్‌లో జరిగిన ఒక ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘మీరు ఎంతకాలం మహారాష్టల్రో బిచ్చమెత్తుకుంటారు? మీరు ఎంతకాలం పంజాబ్‌లో కూలీలుగా పని చేస్తుంటారు?’ అని యుపి ప్రజలనుద్దేశించి అన్నారు.
అయితే రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెసే కారణమని గడ్కారీ ప్రతి విమర్శ చేసారు. ‘జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని సోనియా గాంధీ వరకు ఒకే కుటుంబం, ఒకే పార్టీ ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితి ఉండడానికి కారణమెవరో రాహుల్ గాంధీ చెప్పాలి’ అని గడ్కారీ అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల కారణంగా ధరలు పెరిగిపోవడం, ఆకలి చావులు సంభవిస్తున్నాయని, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితికి సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీలు కూడా అంతే బాధ్యులని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో యువకులు, రైతులు, హిందువులు, ముస్లింలు ఏ వర్గం కూడా సంతోషంగా లేరని, అందరు కూడా కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారని అన్నారు. తాను తిరిగి అధికారంలోకి రాననే విషయం మాయావతికి అర్థం కాగానే ఆమె రాష్ట్ర విభజన నాటకం మొదలు పెట్టారని గడ్కారీ ధ్వజమెత్తారు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బిజెపి అనుకూలమేనని ఆయన అంటూ, తమ ప్రభుత్వ హయాంలోనే ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ను ప్రగతిపథంలో పయనించే రాష్ట్రంగా చేయాలని బిజెపి అనుకుంటోందని, ఇందుకోసం ఒక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గడ్కారీ ప్రకటించారు.
http://www.andhrabhoomi.net/national/b-063

No comments:
Post a Comment