రైతు యాత్రలు లేదా ఏదోఒక పేరుతో చంద్రబాబు ఎంతగా తిరిగినా ప్రజలు ఆయనను నమ్మరని శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ దత్తాత్రేయ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడ్డమే తన ముఖ్య లక్ష్యమన్న ధోరణిలో బాబు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
విధానసభ ఎన్నికలలో ఈసారి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల చిరునామా గల్లంతుకావడం ఖాయని ఆయన జోస్యం చెప్పారు. రాజకీయాలలో ఎప్పుడేమి జరుగుతుందో చెప్పలేమని అంటూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోకాంగ్రెస్ మూడవ స్ధానానికి దిగజారని పోవటం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఏడు వందల పైచిలుకు మండలాలలో కరవువిలయతాండవం చేస్తున్నా, ముఖ్యమంత్రి కిరణ్ ఏఒక్క జిల్లాలోనూ పర్యటించకపోవటం ఆయన బాధ్యతారాహిత్యానికి సాక్ష్యమని అన్నారు. రూపాయి కిలోబియ్యం, రాజీవ్ యువ కిరణాలలోనే ఆయన నిమగ్నం కావడం విడ్డూరమన్నారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుధ్ధి ఉన్నా ఏకరానికి పది వేల రూపాయల వంతున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
http://www.andhrabhoomi.net/national/b-437
No comments:
Post a Comment