నల్లగొండ, నవంబర్ 5 : వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిచి తీరుతుందని, అధికారంలోకి వచ్చి న మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కచ్చితంగా జరిగి తీరుతుందని లోక్‌సభలో ప్రతిపక్ష బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ ప్రకటించారు. అందువల్ల తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని, వ చ్చే తెలంగాణను చూసేందుకు యువత సజీవంగా ఉండాలని పిలుపునిచ్చారు.
శనివారం రాత్రి నల్లగొండలో జరిగిన బీజేపీ 'తెలంగాణ పోరు' సభలో ఆమె మాట్లాడారు. వచ్చే పార్లమెంటు శీతాకాల స మావేశాల్లో యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై బిల్లు పెడితే బీజేపీ మద్దతిస్తుందన్నా రు. చిన్న రాష్ట్రాలతోనే ప్రగతి సాధ్యమవుతుందంటూ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అక్కడి ప్రజలు సుఖంగా ఉన్నారని గుర్తు చేశారు. పంజాబ్ నుంచి విడిపోయిన తర్వాతనే హర్యానా రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పారు.
కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై మండిపడ్డారు. 'తెలంగాణ ప్రజలను హింసించేందుకే ఆ కమిటీని వేశారు. శ్రీకృష్ణ కమిటీది ఆలిండియా కాంగ్రెస్ కమిటీ నివేదికగా ఉంది' అని అన్నారు. '671 మంది ఆత్మ బలిదానం చేస్తే నా హృదయం కదిలింది. కాంగ్రెస్ వారి రాతి గుండెలు స్పందించటంలేదు' అన్నారు. తెలంగాణలోని రైతాంగం భారత దేశాన్ని శాసించే శక్తిమంతులని, అయినా ప్రభుత్వ వివక్షతో కూలీలుగా మారిన దుస్థితి బాధ కలిగిస్తున్నదని చెప్పారు. 'తెలంగాణను ఆంధ్రతో కలపవద్దని ఫజల్అలీ కమిషన్ చెప్పినా ఆంధ్రాతో కలిపారు.
ఇది కొంటె పిల్లగాడికి అమాయక అమ్మాయికి పెళ్ళి చేసిన చందంగా ఉంది' అని అభివర్ణించారు. నల్లగొండలో కృష్ణా జలాలు ఉన్నా ఫ్లోరిన్ సమస్యతో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నేతలు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, లక్ష్మణ్, జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఎన్జీవో అగ్ర నేత స్వామిగౌడ్, తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు నాగం జనార్దన్ రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రజా గాయకుడు గోరటి వెంకన్న పాల్గొన్నారు.
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/6/main/6main14&more=2011/nov/6/main/main&date=11/6/2011శనివారం రాత్రి నల్లగొండలో జరిగిన బీజేపీ 'తెలంగాణ పోరు' సభలో ఆమె మాట్లాడారు. వచ్చే పార్లమెంటు శీతాకాల స మావేశాల్లో యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై బిల్లు పెడితే బీజేపీ మద్దతిస్తుందన్నా రు. చిన్న రాష్ట్రాలతోనే ప్రగతి సాధ్యమవుతుందంటూ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అక్కడి ప్రజలు సుఖంగా ఉన్నారని గుర్తు చేశారు. పంజాబ్ నుంచి విడిపోయిన తర్వాతనే హర్యానా రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పారు.
కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై మండిపడ్డారు. 'తెలంగాణ ప్రజలను హింసించేందుకే ఆ కమిటీని వేశారు. శ్రీకృష్ణ కమిటీది ఆలిండియా కాంగ్రెస్ కమిటీ నివేదికగా ఉంది' అని అన్నారు. '671 మంది ఆత్మ బలిదానం చేస్తే నా హృదయం కదిలింది. కాంగ్రెస్ వారి రాతి గుండెలు స్పందించటంలేదు' అన్నారు. తెలంగాణలోని రైతాంగం భారత దేశాన్ని శాసించే శక్తిమంతులని, అయినా ప్రభుత్వ వివక్షతో కూలీలుగా మారిన దుస్థితి బాధ కలిగిస్తున్నదని చెప్పారు. 'తెలంగాణను ఆంధ్రతో కలపవద్దని ఫజల్అలీ కమిషన్ చెప్పినా ఆంధ్రాతో కలిపారు.
ఇది కొంటె పిల్లగాడికి అమాయక అమ్మాయికి పెళ్ళి చేసిన చందంగా ఉంది' అని అభివర్ణించారు. నల్లగొండలో కృష్ణా జలాలు ఉన్నా ఫ్లోరిన్ సమస్యతో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నేతలు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, లక్ష్మణ్, జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఎన్జీవో అగ్ర నేత స్వామిగౌడ్, తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు నాగం జనార్దన్ రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రజా గాయకుడు గోరటి వెంకన్న పాల్గొన్నారు.
No comments:
Post a Comment