Sunday, November 6, 2011

3 గదులు కాదు.. మూడంతస్తులు - చంద్రబాబు ఇంట్లో

*చంద్రబాబు ఇంట్లో చిన్నాపెద్దా కలిపి మొత్తం 17 గదులు
* 13 వందల గజాల స్థలం.. 448.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇల్లు
* రూ.8. 8 కోట్ల విలువ చేసే భవనం
* ఎన్నికల అఫిడవిట్‌లో స్వయంగా పేర్కొన్న బాబు
* అసలు ప్లాన్‌ను కాదని ఎన్నో అతిక్రమణలు
* బేస్‌మెంట్‌లో రెండు గదులు చూపి ఆరు గదుల నిర్మాణం
* హాలంతా ఒకటిగా చూపి రెండు పెద్దగదులుగా మార్చుకున్న వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాకున్నది మూడు గదుల ఇల్లే...’ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల ఎక్కడికెళ్లినా పదే పదే చెబుతున్న మాటలివి. ఆ ఇంటి విలువ రూ.8.89 కోట్లని ఆయనే స్వయంగా ప్రకటించారు. ‘ఎంత విచిత్రం. మూడు గదులకే ఇంతా...’ అనే అనుమానం అందరికీ తప్పక వస్తుంది. అయితే ఆయన చెప్పే మాటలకు, చేతలకు ఎప్పుడూ పొంతన ఉండదు. నోరు తెరిస్తే అబద్ధాలే. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లోని ప్లాట్ నంబర్ 1310లో ఆయన ఇల్లుంది. 1147.77 చదరపు మీటర్ల (పావు ఎకరంపైనే..) స్థలంలో బేస్‌మెంట్‌తోపాటు, గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్, సెకండ్‌ఫ్లోర్ కలిపిన మూడు అంతస్తుల భవనం అది. చిన్నాపెద్దా కలిపి మొత్తం 17 గదులున్నాయి.

ఈ భవన నిర్మాణానికి ఆయన 1989 ఏప్రిల్ 28న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి పొందారు. ఆ అనుమతి మేరకు మూడు అంతస్తులు కలిపి 448.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించారు. బేస్‌మెంట్ 1,048.62 చదరపు అడుగులు, గ్రౌండ్ ఫ్లోర్ 2,337.92 చ. అడుగులు, ఫస్ట్ ఫ్లోర్ 2,488.61 చ.అడుగుల మేరకు నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మించారు. అయితే అనుమతి తీసుకున్న ప్లానుకు, ఇప్పుడున్న నిర్మాణాన్ని చూస్తే అందులో అనేక అతిక్రమణలు ఉన్నాయి.

బేస్‌మెంట్‌లో రెండు గదులు, కారు పార్కింగ్ కోసం అనుమతి తీసుకుని దాని స్వరూపమే మార్చేశారు. బేస్‌మెంట్ మొత్తాన్ని వెయ్యి చదరపు అడుగుల్లో ఆరు గదులుగా విభజించారు. అందులో తన కుటుంబసభ్యులు నిర్వహించే కంపెనీల అధికారులతో సమావేశాల నిర్వహణకు మినీ కాన్ఫరెన్స్ హాలు, వ్యక్తిగత సిబ్బంది కార్యాలయం, టెలిఫోన్ ఆపరేటర్ల గది, టీవీ చానళ్ల పర్యవేక్షణకు మరో ప్రత్యేక గది, టెలికాన్ఫరెన్స్ గది, సందర్శకులకు తేనీరు వంటివి అందించడానికి వీలుగా కిచెన్‌గా మరో గదిని ఏర్పాటు చేశారు. ఇకపోతే గ్రౌండ్ ఫ్లోర్‌లో అనుమతికి విరుద్ధంగా నిర్మాణం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

గ్రౌండ్ ఫ్లోర్‌లో మొదట హాలు కోసం అనుమతి తీసుకుని దాన్ని రెండు గదులుగా మార్చేశారు. దానికి పక్కనే వ్యక్తిగత సిబ్బంది కోసం చిన్న గదిని కట్టారు. నిజానికి ఇవేవీ మున్సిపాలిటీ నుంచి పొందిన అనుమతిలో లేవు. మొదటి అంతస్తులో ముందు రెండు పెద్ద గదులు.. వాటికి ఆనుకుని మరో రెండు చిన్న గదులు ఉన్నాయి. చిన్న గదులను అనుకుని ఆ ఇంటి ప్రధాన ద్వారం (రెండో పక్కన), అక్కడి నుంచి లోనికి వెళ్లడానికి దారి ఉంది. లోపల లివింగ్ రూం, డైనింగ్ హాలు, ప్రత్యేక కిచెన్ గది, ఒక బెడ్‌రూమ్ ఉన్నాయి. వీటికి తోడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన (పక్కన) లాన్ ఉన్నాయి. రెండో అంతస్తులో రెండు పడక గదులు, జిమ్ రూం, ఒక హాలు నిర్మించారు. రోడ్డు నంబర్ 65లో అందరికీ కనిపించే ఇంటి వెనుక ఎవ రికీ కనిపించని విధంగా పనివారి కోసం ప్రత్యేకంగా రెండు గదులను నిర్మించారు.

ఇంటిపక్కన స్థలంలో కాన్ఫరెన్స్ హాలు
వీటికి తోడు ఈ మధ్య కాలంలోనే తన నివాసం పక్కన ఉన్న ఒక ఇంటిని కొనుగోలు చేసి దాన్ని కూల్చివేశారు. అక్కడ ఒక కాన్ఫరెన్స్ హాలును నిర్మించి విలేకరుల సమావేశాలకు, పార్టీ సమావేశాలకు, సందర్శకులను కలిసేందుకు వినియోగిస్తున్నారు. ఇందులో మిగి లిన స్థలాన్ని తన కుటుంబసభ్యుల వాహనాల పార్కింగ్‌కు వాడుతున్నారు. 1989లో చంద్రబాబు తన ఇంటికి తీసుకున్న అనుమతులు ఎలా ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఆయన మూడంతస్తుల మేడలో చిన్నా పెద్దా కలిపి 17 గదులున్నాయి.

ప్లాన్‌లో అతిక్రమణలు సరేసరి. ఈ ఇంటి పక్కనే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ ఉపాధ్యక్షుడు, కాంట్రాక్టర్ సీఎం రమేశ్ అధునాతన భవంతి కూడా ఉంది. తన ఇంటి విలువ అక్షరాలా రూ.8,89,75,000 అని చంద్రబాబు స్వయంగా 2009 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇంత పెద్ద మేడ కట్టుకుని తనది మూడు గదుల ఇల్లేనంటూ తెలుగుదేశం అధినేత ప్రజల వద్ద, మీడియాలో బుకాయిస్తున్నారు. అంతేకాదు నిత్యం తన ఇంటిని సందర్శించే తమను కూడా అందరిలా నమ్మాలని కోరుతుండటంతో పార్టీ నేతలు విస్తుపోతున్నారు.
 http://www.sakshi.com/main/FullStory.aspx?catid=261866&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment