Tuesday, November 8, 2011

అదంతా మీడియా సృష్టి.. * గుజరాత్ సిఎం మోడీ స్పష్టీకరణ

అద్వానీతో విభేదాల్లేవు


భారుచ్ (గుజరాత్), నవంబర్ 7: బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీకి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. తమ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. మీడియాలో కొంత భాగం సంచలనాల కోసం ఇలా ప్రచారం చేస్తుండగా, మరో భాగం అధికార కాంగ్రెస్ పార్టీ చేతుల్లో కీలుబొమ్మగా మారి తమ గురించి దుష్ప్రచారానికి ఒడిగడుతోందని ధ్వజమెత్తారు. అద్వానీ జన చేతనా యాత్రలో భాగంగా సోమవారం ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ, మీడియా నిన్నటి యాత్రకు సంబంధించిన వార్తలనందిస్తూ అద్వానీకి, తనకు మధ్య విభేదాలు ఉన్నాయని, తామిద్దరం ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నామని పేర్కొందని, అది అవాస్తవమని ఖండించారు.

నిన్న వాపిలో జరిగిన స్వాగత సభలో అద్వానీకి, తనకు మధ్య ఒక ఖాళీ కుర్చీ ఉన్న చిత్రాన్ని ముద్రించి, తమ మధ్య ఉన్న దూరానికి నిదర్శనంగా పేర్కొన్నారని ఆయన అన్నారు. దీన్ని ప్రచురించిన దినపత్రికను ఆయన సభికులకు చూపించారు. ఆ కుర్చీలో కూర్చున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.సి.్ఫల్డు ప్రసంగించడానికి లేచినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండకుండా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

‘మోడీ ప్రసంగించడానికి లేచినా సహజంగానే అతని కుర్చీ ఖాళీగా ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. అనంత కుమార్, అద్వానీల మధ్య కుర్చీ ఖాళీగా ఉండటంపై కూడా జాతీయ స్థాయి దినపత్రికలు పెద్ద పెద్ద కథనాలు ప్రచురించాయని, రుచి లేని వంటకానికి సాంబారులా దీన్ని జోడించాయని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వార్తాపత్రికల శీర్షికలు, టివి స్క్రీన్లపై తాను లేకపోయినా ప్రజల హృదయాల్లో మాత్రం తనకు చోటుందని మోడీ వ్యాఖ్యానించారు.

http://www.andhrabhoomi.net/national/modi-clarifies-415

1 comment:

  1. UP ka kethna news channels hi pura congress ka under chal raha hi sir ji

    ReplyDelete