తన జనచేతన యాత్రలో ఇప్పటి వరకు ప్రధాని మన్మోహన్‌ను, కాంగ్రెస్‌ను తూర్పారబట్టిన అద్వానీ, ఇప్పుడు తన వాగ్బాణాలను సోనియా గాంధీపై ఎక్కు పెట్టారు. 'నల్ల ధనంపై దేశంలో ఇంత చర్చ జరుగుతుంటే, నోరు మెదపవేమి తల్లీ' అంటూ ప్రశ్నించారు. నల్ల ధనం, అవినీతి, ద్రవ్యోల్బణంపై సోనియా గాంధీ తన భావాల్ని వ్యక్తం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఇతర కాంగ్రెస్ నాయకులతో పాటు, అప్పుడప్పుడూ ప్రధాని కూడా మాట్లాడుతున్నారని; కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియాగాంధీ మాత్రం ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు.
కమ్యూనిస్టు దేశాలలో ప్ర«భుత్వాధినేత కంటే, పార్టీ అధినేతే ప్రధానమని, ఇప్పుడు దేశంలో ఆ తరహా వ్యవస్థ సాగుతున్నదని ఆయన విమర్శించారు. అందుకే, సోనియా అభిప్రాయం ముఖ్యమని అన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను వెనక్కు పిలిపించే విధానం మన దేశంలో కుదరదన్న ఎన్నికల కమిషన్ అభిప్రాయంతో తాను కూడా ఏకీభవించక తప్పడం లేదని ఆయన చెప్పారు. ఇంత విశాలమైన దేశంలో అటువం టి నిబంధనలు, మొత్తం వ్యవస్థనే అస్థిరం చేసే అవకాశం ఉన్నదన్నారు. అయితే, ఎన్నికల సంస్కరణలు తప్పనిసరని పేర్కొన్నారు. ఎక్కడో చీమ తలకాయంత చిన్న దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఈ నిబంధనను అమలు చేయడం లేదని ఆయన అన్నారు
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/6/national/6national7&more=2011/nov/6/national/nationalmain&date=11/6/2011
No comments:
Post a Comment