ముగిసిన అద్వానీ యాత్ర... రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీ
న్యూఢిల్లీ, నవంబర్ 20: నల్లధనంపై ఎన్డీయే ఎంపీలంతా పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేస్తారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ స్పష్టం చేశారు. 38 రోజులు సాగిన జన్ చేతన యాత్ర ఆదివారం న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సందర్భంగా రాంలీలా మైదానంలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి అద్వానీ మాట్లాడుతూ ఎన్డీయే ఎంపీల్లో ఎవరికీ అక్రమార్జనలుగానీ, విదేశాల్లో బ్యాంకు ఖాతాలుగానీ లేవని అన్నారు. ఇదే విషయాన్ని వారంతా లిఖిత పూర్వక ప్రకటన చేస్తారని తెలిపారు.
లోక్‌సభలో స్పీకర్ మీరా కుమార్‌కు, రాజ్య సభలో చైర్మన్ హమీద్ అన్సారీకి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం ఆరంభంకానుండగా, వారం రోజుల్లోగా ఎన్డీయే సభ్యులంతా తమ డిక్లరేషన్‌ను అందచేస్తారని అద్వానీ వివరించారు. అవినీతి, నల్లధనం తదితర అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి తాను చేపట్టిన రథయాత్ర విజయవంతమైందని అద్వానీ తెలిపారు. అనారోగ్యం కారణంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి రథయాత్రలో పాల్గొనలేకపోవడం ఒక్కటే వెలితిగా ఉందని పేర్కొన్నారు. తన 60 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో దేశవ్యాప్తంగా యాత్ర చేయడం ఇది ఆరోసారని చెప్పారు. పలు రకాలుగా ఈ యాత్ర ప్రాధాన్యతను సంతరించుకుందని అద్వానీ అన్నారు.
ఎన్డీయే భాగస్వామ్య పార్టీ జనతా దళ్-యునైటెడ్ (జెడి-యు) చీఫ్ శరద్ యాదవ్ మాట్లాడుతూ 2-జి స్పెక్ట్రమ్, అవినీతి తదితర కేసుల్లో నిందితులపై కాంగ్రెస్ మెతక వైఖరి అవలంభిస్తున్నదని ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిని జైళ్లలోకి నెడుతున్నదని విమర్శించారు. అవినీతి కేసులో కాంగ్రెస్ సభ్యుడు కల్మాడీ ఒక్కరే జైలులో ఉన్నారని యాదవ్ గుర్తుచేశారు. ఇంకా ఎంతోమంది అవినీతి కూపంలో కూరుకుపోయినప్పటికీ, వారిపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ముందుకు రావడం లేదని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో ఇప్పటి వరకూ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా అరెస్టు కాలేదని యాదవ్ తెలిపారు.
కాంగ్రెస్ అవినీతిని బట్టబయలు చేసి, ఎండగట్టడానికే అద్వానీ రథయాత్ర చేశారని అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు, బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ కేంద్రంలోని యుపిఎ సర్కారు తీసుకుంటున్న పొరపాటు విధానాల కారణంగానే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయని విమర్శించారు. అవినీతి ప్రభుత్వాన్ని మన్మోహన్ సింగ్ నడుపుతున్నారంటూ ధ్వజమెత్తారు. ధరల పెరుగుదల వల్ల దేశంలో సామాన్యులు, ముఖ్యంగా మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురవుతుర్నారని అన్నారు. దేశాన్ని నడిపించాల్సిందిగా ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే, ప్రధాని అవినీతి సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను అద్వానీ రథయాత్ర బైటపెట్టిందని వ్యాఖ్యానించారు. రథయాత్ర ముగిసినప్పటికీ, అవినీతిపై తాము ప్రారంభించిన పోరాటం పూర్తికాలేదని స్పష్టం చేశారు.
ఈ ర్యాలీలో బిజెపి అగ్రనేతలు నితిన్ గడ్కారీ, అనంత్ కుమార్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయుకుడు అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొన్నారు.
http://www.andhrabhoomi.net/national/m-087

No comments:
Post a Comment