November 24th, 2011
హైదరాబాద్, నవంబర్ 23: ముఖ్యమంత్రి కిరణ్ ఏడాది పాలనలో పన్నులే తప్ప పనులు మాత్రం కనిపించడం లేదని బిజెపి ఎద్దేవా చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ బుధవారం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. చేనేత కార్మికులు, రైతులు, తెలంగాణ వాదం పేరుతో కొంత మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారని, నిత్యావసరాల ధరలు అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పాలనా యంత్రాంగం అంతా అవినీతి మయం అయిపోయిందని ముఖ్యమంత్రే స్వయంగా అంగీకరించారని గుర్తుచేశారు.
రచ్చబండ సందర్భంగా వజ్రపుకొత్తూరులో సిఎం మాట్లాడుతూ కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసమే 2వేల కోట్లు లంచాలుగా వెచ్చించారని చెప్పడం అవినీతిమయం కాదా అని ప్రశ్నించారు. సిఎం 38సార్లు ఢిల్లీ వెళ్లారని, స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయితీలు, మండలాలు, మున్సిపాల్టీల ఎన్నికలను గాలికొదిలేశారని అన్నారు. ప్రజలపై అదనపు పన్నులు విధించడమే తప్ప అభివృద్ధి పనులు జరగలేదన్నారు. వ్యాట్ పరిధిలోకి అనేక వస్తువులు తీసుకురావడం, పన్నులు పెంచడం జరిగిందని అన్నారు. ఆ విధంగా 3వేల కోట్ల రూపాయిలు సిఎం ప్రజలపై భారం వేశారని ఒక వైపు అసమ్మతి, మరో వైపు మంత్రుల సమన్వయ లోపం ఉందని, ఏడాది కాలంలో కనీసం మూడు నెలలు అసెంబ్లీ జరగాల్సి ఉండగా, 10 రోజుల పాటు కూడా జరగడం లేదని వ్యాఖ్యానించారు. రైతులకు ప్యాకేజీ లేకున్నా, స్వగృహానికి వస్తామన్న ఎమ్మెల్యేలకు మాత్రం ప్యాకేజీలు ఇస్తున్నారని, పరిపాలనలో అనేక ఫైళ్లు సిబిఐ ఆధీనంలో ఉన్నాయని, అవినీతి, ఆశ్రీతపక్షపాతం, బంధుప్రీతి, ఆర్ధిక సంక్షోభం, ఆకాశయానం, అసమర్ధపాలన మాత్రమే సిఎం డైరీలో కనిపిస్తున్నాయని అంతకుమించి సాధించింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఆయన పాలన ఏడాది గడచినా, జనానికి గడ్డుకాలం గడవలేదని అన్నారు.
http://www.andhrabhoomi.net/state/p-979

No comments:
Post a Comment