'సర్కారును అరెస్ట్ చేసిన అన్నా' - మనం, అరవై ఐదవ స్వాతంత్య్రదినోత్సవం జరుపుకొన్న రెండో రోజున ఒక జాతీయ దినపత్రిక పతాక శీర్షిక అది. ప్రధాని మన్మోహన్, ఆయన ప్రభుత్వానికి ఇదెంత నగుబాటో చెప్పాలా? స్వతంత్ర భారతదేశంలో ఇంతగా దురహంకారంతోను, బుద్ధిహీనంగాను వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదు. అందుకే అంతగా అవమానం పాలయింది.
భారత రాజ్య వ్యవస్థ ప్రతీకల మధ్య ఉన్న ఇండియా గేట్ గతంలో ఎన్నో భారీ రాజకీయ ప్రదర్శనలకు సాక్షిగా ఉంది. అయితే ఈ ఆగస్టు 17న రాజకీయ లక్ష్యాలు లేని అసంఖ్యాక ప్రజల స్వచ్ఛంద నిరసన ప్రదర్శనకు ఆ చరిత్రాత్మక కట్టడం సామాన్యులు సృష్టిస్తోన్న చరిత్రను వీక్షించింది. మున్నెన్నడూ సంభవించని పరిణామమిది. అవినీతి నిర్మూలనకు ఉద్యమిస్తోన్న అన్నా హజారేను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టడం వల్లే సామాన్య భారతీయులు, కాదు, అసమాన ప్రజాస్వామిక చైతన్యపరులు తమకు తాముగా ప్రభుత్వానికి నిరసన తెలిపారు.
ఇలా న్యూఢిల్లీలోనే కాదు, ఆసేతు హిమాచలం ఎన్నో ప్రదేశాలలో ప్రజల ధర్మాగ్రహం వ్యక్తమయింది. సగటు పౌరుల మనోగతానికి దిగ్భ్రాంతి చెందిన పాలకులు అన్నా హజారేకు స్వేచ్ఛనిచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా నిరవధిక నిరాహారదీక్ష నిర్వహించడానికి అనుమతినిచ్చారు. తన తప్పును ఇలా సరిదిద్దుకోనట్టయితే మన్మోహన్ ప్రభుత్వం ఈ పాటికి తన అంతిమ ఘడియల్లో ఉండేది కాదా? ఈ కాలమ్ రాస్తున్న సమయానికి అన్నా నిరశన దీక్ష పదో రోజులోకి ప్రవేశించింది. పర్యవసానాలు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి.
అధికారంలో ఉన్న రాజకీయవేత్తలు పలువురు నేర్చుకోవడానికి తిరస్కరించే మౌలిక పాఠం ఒకటి ఉంది. భారత ప్రజలు అంతులేని అవినీతినైనా సహిస్తారేమోగాని పాలకుల దురహంకారాన్ని ఎంత మాత్రం సహించరు. ముక్కుసూటిగా వ్యవహరిస్తోన్న అన్నాకు ఒక గుణపాఠం నేర్పాల్సిన అవసరముందని మన్మోహన్, ఆయన సలహాదారులు భావించారు. ఇప్పుడు వారికే, ధర్మాగ్రహావేశపరులైన భారత సామాన్యులు, మరచిపోలేని ఒక పాఠాన్ని నేర్పారు. 2011 లోని భారతదేశం 1975 నాటి భారతదేశం కాదని మన్మోహన్ ప్రభృతులు దయచేసి తెలుసుకుంటారా?
యూపీఏ రెండో ప్రభుత్వం ఎదుర్కొంటోన్న సంక్షోభం పూర్తిగా స్వయంకృతమే. లోక్‌పాల్ బిల్లుపై పార్లమెంటు లోపలా, వెలుపల చాలాకాలంగా చర్చ జరుగుతోంది. లోక్‌పాల్ వ్యవస్థ పరిధిలోకి ప్రధాన మంత్రి, ఉన్నత న్యాయవ్యవస్థను చేర్చడం వాంఛనీయం కాదని, అవినీతిపై పోరుకు అది తప్పనిసరి కాదని దేశ ప్రజలకు ప్రధాని మన్మోహన్ నచ్చచెప్పి వుండవలిసింది. చిత్తశుద్ధితో వ్యవహరించినట్టయితే అదేమంత కష్టమేమీకాదు. ప్రధానమంత్రి అధికారాలను, ఉన్నత న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని పరిరక్షించవల్సిన అవసరముందని ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని చెప్పివుండవల్సింది.
అలాగే, ప్రతిపాదిత లోక్‌పాల్‌ను, రాజ్యాంగ నిబంధనావళిలో ఎటువంటి మార్పులు చేయకుండానే, పటిష్ట, శక్తిమంతమైన వ్యవస్థగా ఏర్పాటు చేయవచ్చని అన్నా హజారే, ఆయన సహచరులకు నచ్చచెప్పి ఉండవల్సింది. అప్పుడు లోక్‌పాల్‌పై ప్రభుత్వ వాదనలకు బలంచేకూరి వుండేది. జన్ లోక్‌పాల్ బిల్లులోని వివిధ మంచి అంశాల(సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం మొదలైనవి)ను చిత్తశుద్ధితో అంగీకరించి ఉండవల్సింది. ఈ అంశాలను ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లులో చేర్చుతామని అన్నా బృందానికి ప్రధాని హమీ ఇచ్చివుండవల్సింది. ఇదే సమయంలో అవినీతి వ్యతిరేక సంస్కరణలను మరింత సమగ్రంగా రూపొందించి అమలుపరచడానికి పౌర సమాజం, వివిధ రాజకీయ పక్షాల నుంచి నిర్దిష్ట సూచనలను తీసుకోవడానికి ప్రధానమంత్రి ప్రయత్నించి వుండవల్సింది.
మన దేశంలో రాజకీయ అవినీతికి మూలమైన ఎన్నికల వ్యయం విషయంలో ప్రభుత్వమే, పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని భరించే విధంగా ఎన్నికల సంస్కరణలను తక్షణమే చేపట్టవల్సిన అవసరమెంతైనా ఉంది కదా. ఈ అంశాలన్నిటిపైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించినప్పటికీ, అన్నా, ఆయన సహచరులు తాము రూపొందించిన జన్‌లోక్‌పాల్‌ను అమలుపరచాల్పిందేనని పట్టు పట్టే వారేనా? నిరవధిక నిరశన దీక్షకు పూనుకొనేవారేనా? అన్నా బృందం అలా చేసినట్టయితే వారు హేతువిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు తప్పక భావించేవారు. అన్నాకు సామాన్య ప్రజలు దూరమయ్యేవారు. మరి ఈరోజు ఒంటరివాడైపోయింది, బలహీనపడింది, నైతికంగా ఓడిపోయింది ప్రధాని మన్మోహనే. వివేకం భ్రష్టమయినప్పుడు జరిగేది ఇదే సుమా!
మరి ఆ వివాదరహితమైన, స్వతసిద్ధంగా ప్రయోజనకరమైన బాటను డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎందుకు అనుసరించలేదు? సమాధానం స్పష్టమే. ఆయన ప్రధానమంత్రేకాని, ప్రధానమంత్రి అధికారాలు ఉన్న ప్రభుత్వాధినేత కాదు. యూపీఏ ప్రభుత్వంలో నిజమైన అధికారాలు చెలాయిస్తోన్న వారు పరిణత నాయకులు కారు; ప్రజాస్వామ్య సూత్రాలు, విలువల పట్ల చిత్తశుద్ధితో నిబద్ధమైన వారు కాదు. ఒక సమస్యను ఏకాభిప్రాయంతో పరిష్కరించుకొనేందుకు దేశ ప్రజలందరినీ చర్చలో భాగస్వాములను చేసే చిత్తశుద్ధి వారిలో కొరవడింది. సూటిగా వ్యవహరించడంలో ప్రధాని మన్మోహన్‌కు మరో అంతర్గత ఆటంకం ఉంది.
ఆయన తన సొంత ప్రభుత్వంలో గాని, సొంత పార్టీ భారత జాతీయ కాంగ్రెస్‌లో గానీ అవినీతిని నిరోధించగల పరిస్థితిలో లేరు. సంకుచిత ప్రయోజనాలకు అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ అవినీతి బాగోతాలతో పతాక శీర్షికలకెక్కుతున్నవారిపై సకాలంలో తగు చర్యలను సైతం మన్మోహన్ తీసుకోలేకపోతున్నారు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. 2008 జూలైలో చోటు చేసుకున్న సిగ్గుచేటైన 'ఓటుకు నోటు' అవినీతికి ప్రత్యక్ష లబ్ధిదారుడు కావడమే ఆయన నిస్సహాయతకు ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
అవిశ్వాసపరీక్ష నుంచి ప్రభుత్వాన్ని రక్షించేందుకు ప్రతిపక్ష ఎంపీలకు పెద్దఎత్తున డబ్బును ముట్టచెప్పడమనేది ఆయన ప్రమేయం లేకుండా జరిగి ఉంటుందా? ఇలా అవినీతిని ప్రోత్సహించే వ్యక్తి (అవినీతిని నిర్మూలిస్తామని) చేసే గంభీర ఉద్ఘాటనలను ఎవరు విశ్వసిస్తారు? పదిరోజుల క్రితం తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మన్మోహన్ పలుమార్లు ప్రస్తావించారు! ఎవరిని నమ్మించడానికీ మాటలు? ఆ మరుసటి రోజే, అవినీతిపై ధర్మయుద్ధం చేస్తోన్న అన్నా హజారేను తీహార్ జైలుకు పంపించారు! యూపిఏ నైతిక భ్రష్టత్వానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? డాక్టర్ మన్మోహన్ సింగ్ తనకు తానుగా చేసుకున్న ఈ గాయాల నుంచి ఉపశమనం పొందగలరా? కష్టమే. ఆయన ఇప్పటికే వర్తమాన వాస్తవాలను గుర్తించని ప్రధానమంత్రిగా కన్పిస్తున్నారు.
అవినీతిపరులను రక్షించడానికి తన ప్రభుత్వంలోని వారు చేసిన పనులకు ఆయన తప్పకుండా భారీ మూల్యం చెల్లిస్తారు. అంతకంటే ముఖ్యంగా శాంతియుత ఆందోళనకు పూనుకున్న ఒక వృద్ధ నేతను, నిరశన దీక్ష ప్రారంభించకముందే అరెస్ట్ చేసి, దేశాన్ని నిలువునా ముంచే అవినీతికి పాల్పడిన ఘనులను ఉంచిన జైలుకు పంపిన ఘోర తప్పిదానికి కూడా మన్మోహన్ పెద్ద మూల్యమే చెల్లించవలసివుంటుంది.
ఈ విషయమై పార్లమెంటులో జరిగిన చర్చలో ప్రధానమంత్రి గానీ, ఆయన సహచరులు గానీ ఎటువంటి పశ్చాత్తాపం ప్రకటించకపోగా సమర్థించుకోవడం జరిగింది. ఇది వారి ఉమ్మడి అపరాధాన్ని మరింత సంక్లిష్టం చేసింది. ఇంకా వారిలో ఆత్మ పరిశీలన చేసుకొనే వివేకమేమైనా మిగిలి ఉందా? ఉన్నట్టయితే వారు తమకు తాము ఈ ప్రశ్న వేసుకోవాలి: లక్షలాది భారతీయులు తమకు తామే త్రివర్ణ పతాకాన్ని చేతబూని దశాబ్దాలుగా కనీవినీ ఎరుగని అహింసాయుత పోరాటంలోకి ఎందుకు దుమికారు?
సరే, ప్రతిపక్షాలు సైతం, ముఖ్యంగా బిజెపి ప్రజల మనోభావాలను గుర్తించాయని వర్తమాన పరిమాణాలు రుజువు చేస్తున్నాయా? ఊహూఁ లేదు. కర్ణాటక లోకాయుక్త సంతోష్‌హెగ్డే నివేదిక సమర్పించక ముందే అవినీతిపరుడైన ముఖ్యమంత్రి యడ్యూరప్పను బిజెపి ఎందుకు తొలగించలేదు? ఏమైనా సకల రాజకీయ పక్షాలు చిత్తశుద్ధితో ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయమాసన్నమయింది.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

No comments:
Post a Comment