డెహ్రడూన్, నవంబర్ 18: కేంద్రంలో పరిపాల అస్తవ్యవస్తంగా ఉందని బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ నిప్పులు చెరిగారు. యుపిఏ ప్రభుత్వం అచేనతనంగా పడి ఉంది. ప్రజలకు సంబంధించి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని ఆయన విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా అద్వానీ చేపట్టిన జనచేతన యాత్ర శుక్రవారం ఇక్కడకు చేరుకుంది. అద్వానీ మాట్లాడుతూ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వారసత్వ రాజకీయాల్లో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ దేశ ప్రజలను గాలికొదిలేసిందని ఆయన దుయ్యబట్టారు. ‘ పండిట్ జవహర్‌లాల్ ప్రభుత్వం నుంచి అన్ని ప్రభుత్వాలను నేను చూశాను. కేంద్రంలో ఇంత అధోగతి పాలన నా జీవితంలో చూడలేదు’ అని అద్వానీ అన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. పార్టీ అధ్యక్షురాలు ఆడమన్నట్టు ఆడుతున్నారని మన్మోహన్‌పై బిజెపి నేత విరుచుకుపడ్డారు. వారసుడిగా ఎవర్ని పెట్టాలనే దానిపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై కరవైందని ఆయన చెప్పారు. కేంద్రంలో వామపక్ష తరహా పాలన సాగుతోందని ఆయన అన్నారు. దేశం కన్నా పార్టీ అధ్యక్షురాలే మన్మోహన్‌కు ముఖ్యమని, అన్నింటా ఆమె మాటే చెల్లుబాటు అవుతోందని బిజెపి నేత విమర్శించారు.
ఒక్కోసారి తనేక వామపక్ష తరహాపాలనలోఉన్నానా అనే అనుమానం కలుగుతోందని అద్వానీ వ్యంగ్యంగా అన్నారు. నల్లధనం అంశంపై ఆయన మాట్లాడుతూ విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న 25 లక్షల కోట్ల నల్లధనం దేశానికి రప్పించడానికి కేంద్రం చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా సంస్థ తెలిపిన లెక్కల ప్రకారం విదేశీ బ్యాంకుల్లో 25 లక్షల కోట్ల రూపాయలున్నాయని తేలిందని, అంత డబ్ము అక్కడ దాచిందెవరకో కేంద్రం ఆరా తీయాలని ఆయన తెలిపారు. స్విస్ బ్యాంకు ఆయా దేశాల సొమ్ములు ఇచ్చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు తమ డబ్బు తెచ్చుకోడానికి చర్యలు ప్రారంభించాయని ఆయన పేర్కొన్నారు. అనేక చిన్న దేశాలు అదే దారిలో ఉన్నాయని అద్వానీ చెప్పారు. అయితే భారత దేశం మాత్రం ఉలుకుపలుకూ లేకండా ఉందని బిజెపి నేత ధ్వజమెత్తారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నల్లధనం అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన వెల్లడించారు.
హిమాచల్‌లోని కలా అంబా ప్రాంతంలో అద్వానీ మాట్లాడుతూ యుపిఏ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో అవగాహన తేవడానికే జన చేతన యాత్ర చేపట్టినట్టు తెలిపారు.
(చిత్రం) జన చైతన్య యాత్రలో భాగంగా హరిద్వార్ చేరుకున్న
సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీకి గదను బహూకరిస్తున్న
http://www.andhrabhoomi.net/national/k-425
No comments:
Post a Comment