November 17th, 2011 జమ్ము, నవంబర్ 16: కాశ్మీర్‌లోని సైనిక దళాలను రాక్షసంగా చూపించేందుకు ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ అన్నారు. సైనిక దళాలను సంప్రదించుకుండా సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని జమ్ము, కాశ్మీర్ నుంచి ఉపసంహరించేందుకు ఎలాంటి ప్రయత్నం జరగకూడదని ఉద్ఘాటించారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఎఎఫ్‌ఎస్‌పిఎ చట్టాన్ని ఉపసంహరించే విషయంలో సైనిక దళాలు అంగీకరిస్తే ఆ పని చేయాలి. కుదరదంటే మానేయాలి’ అని తెలిపారు. అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా చేపట్టిన 40రోజుల జనచైతన్య యాత్రలో భాగంగా అద్వానీ బుధవారం ఇక్కడికి వచ్చారు.
ఈ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా వ్యవహరించాలే తప్ప దాటవేత ధోరణిని అవలంబించకూడదని అన్నారు. సైనిక దళాల కృషి ఫలితంగానే జమ్ముకాశ్మీర్ భారత దేశంలో భాగంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల సైనిక దళాల ఆత్మస్థయిర్యం దెబ్బతింటోందని, ఒక వేళ తప్పు జరిగితే సరిదిద్దే ప్రయత్నం చేయాలే తప్ప దళాలనే భ్రష్టుపట్టించే ప్రయత్నం సమంజసం కాదని హితవు చెప్పారు.
(చిత్రం: జమ్మూలో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తున్న బిజెపి నేత ఎల్.కె.అద్వానీ.)

No comments:
Post a Comment