November 3rd, 2011
విదేశీ బ్యాంకులలో వందల కోట్ల రూపాయలు దాచగల వారు కాంగ్రెస్ పార్టీలోఎవరికి ఉందో చెప్పవలసిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. దీనిపై అందరికీ కచ్చితమైన అవగాహన ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పన్ను ఎగవేతకు స్వర్గ్ధామంగా మారిన దేశాల నుంచి ఈ సొమ్ము బయటకు తరలి వెళ్లిందని ఆయన చెప్పారు.
నల్లధనం దేశానికి రప్పించడంతో కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తోందని, దానికి ముఖ్యకారణం కాంగ్రెస్ అగ్రనాయకులకు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఉండటమేనని బిజెపి నేత ఆరోపించారు. పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో ఈవిషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అవినీతిని పరోక్షంగా సమర్ధిస్తున్నారని ఆయన విమర్శించారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిదంబరం పాత్ర ఉన్నట్టు తెలిసినా ప్రభుత్వం కాపడుతోందని అన్నారు.
http://www.andhrabhoomi.net/international/wre-094
No comments:
Post a Comment