ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పాల్పడుతున్న అవినీతిపై ఎందుకు వౌనం వహిస్తోందని బిజెపి నేత ప్రశ్నించారు.
సాక్షాత్తు ప్రధాని మన్మోహన్‌సింగ్ నియమించిన షుంగ్లూ కమిటీ సైతం కామనె్వల్త్ క్రీడల నిర్వహణలో జరిగిన
అవినీతితో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు సంబంధం ఉందని చెప్పినప్పటికీ ఆమెను ఎలా కొనసాగనిస్తున్నారో కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంతో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరానికి సంబంధం ఉన్నట్లు రుజువైనా పదవిన పట్టుకుని వేలాడడం సరైనదేనా? అని ఆయన అన్నారు. టుజి స్పెక్ట్రమ్ సొమ్ము నుంచి కొంత మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ముట్టినందునే చిదంబరం పదవిలో కొనసాగుతున్నారని జావడేకర్ తీవ్ర ఆరోపణ చేశారు. కాగా డిసెంబర్ నాటికి ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటనను ఆయన ఎద్దేవా చేశారు. ప్రణబ్ రెండేళ్ళుగా ఇదే మాట చెబుతున్నారని ఆయన అన్నారు.
జమ్మూకాశ్మీర్ భారత దేశంలో అంతర్భాగంగా కొనసాగితీరాలన్న విషయంలో బిజెపి రాజీపడబోదని ఆయన స్పష్టం చేశారు.
http://www.andhrabhoomi.net/national/bjp-dwajam-541
No comments:
Post a Comment