కరీంనగర్, నవంబర్ 2 ( ప్రతినిధి): రాష్ట్ర ప్ర భుత్వాన్ని కూల్చితే తప్ప కేంద్రానికి బుద్ధిరాదని స్పష్టమైనందున వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా ప్రయత్నించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి 147 మంది సభ్యుల మద్దతు ఉండాల్సిఉండగా 143 మంది మాత్రమే ఉన్నారని, అవిశ్వాస తీర్మానం పెడితే రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలుతుందని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశంపైనే ఈ గురుతర బాధ్యత ఉందని, చంద్రబాబుకు ఇది అగ్నిపరీక్ష అవుతుందని ఆయన అన్నారు. రెండు సీట్లు ఉన్న బీజేపీ తమకు సలహా ఇచ్చేదేమిటని చంద్రబాబు మాట్లాడటం సరైంది కాదని విద్యాసాగర్‌రావు అ న్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉందని, బలనిరూపణ అవసరం లేదని, గవర్నర్ నరసింహన్ ప్రసార సాధనాల ముందు చేసిన ప్రకటన ఆయన హోదాకు తగినది కాదన్నారు. అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం లేదని గవర్నర్ పేర్కొనడాన్ని బీజేపీ ఖండిస్తున్నదని ఆయన పే ర్కొన్నారు. అవిశ్వాసం ప్రవేశపెట్టాలంటే గవర్నర్‌ను అడగాల్సిన అవసరం లేదని విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. తన ప్రకటనకు వివరణ ఇచ్చుకోవల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని గుర్తు చేశారు.
ప్రజలు గవర్నర్‌ను రీకాల్ చేయమని కోరే అవకాశం ఉందని విద్యాసాగర్‌రావు అన్నారు. ఈ ప్రభుత్వానికి మెజారిటీ లేదని శాసనసభ్యుడు వేణుగోపాలాచారి హైకోర్టును ఆశ్రయించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నా రు. ఈ పిటిషన్ హైకోర్టులో ఉన్నా బలనిరూపణ అసెంబ్లీలోనే జరగాలని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయని ఆయన చెప్పారు.
కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరి కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారు అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని ఎలా అనుకుంటున్నారని, రాజీనామాలు చేసిన వారు వాటిని ఆమోదించాలని పదేపదే కోరే దుస్థితి కలుగుతున్నదని విద్యాసాగర్‌రావు విమర్శించారు. స్పీకర్ వెంటనే రాజీనామాల ఆమోదం పై నిర్ణయం తీసుకోవాలని, ఆయన రాజకీయ ప్రతిష్టంభన కొనసాగాలని నిర్ణయిస్తే ప్రజలు ఊరుకునే స్థితిలో లేరని హెచ్చరించారు. గవర్నర్, స్పీకర్ రాజ్యాంగ బద్ధం గా వ్యవహరించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నదని విద్యాసాగర్‌రావు చెప్పారు. తెలంగాణలో గ్రామీణ రుణ విమోచన చట్టాన్ని వెంటనే అమలుచేయాలని ఆయన కోరారు.

No comments:
Post a Comment