హైదరాబాద్, నవంబర్ 16 : టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై హైకోర్టు విచారణకు ఆదేశించడంతో.. తమ వాదనలు వినడానికి న్యాయస్థానం అవకాశం ఇవ్వలేదంటూ ఆ పార్టీ నేతలు కొత్త రాగాలు ఆలపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఇలాంటి డొంక తిరుగుడు వాదనలను మానేసి.. శాసనసభ సభ్యత్వానికి చంద్రబాబు రాజీనామా చేసి దర్యాప్తునకు సహకరించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
తన అవినీతి గురించి శాసనసభ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా విచారణ కమిటీలు వేసి రుజువు చేయాలంటూ బాబు సవాల్ చేసేవారని గుర్తు చేశారు. ఇప్పుడేమో 26 కమిటీలు వేసినా తనకు వ్యతిరేకంగా ఏమీ తేల్చలేదని, మళ్లీ సీబీఐ విచారణకు ఆదేశించడం ఏకపక్షమంటూ వాదించడం ఏమిటని ప్రశ్నించారు.
గతంలో ఓబుళాపురం గనుల విషయంలో వై.ఎస్. సర్కారు వేసిన సభాసంఘం గాలి జనార్దన్‌రెడ్డికి క్లీన్‌చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై 'బాబు జమానా- అవినీతి ఖజానా' పేరిట సీపీఎం రూపొందించిన డాక్యుమెంటరీ ప్రతిని సీబీఐకి బీజేపీ అందిస్తుందని ప్రభాకర్ వెల్లడించారు.

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/17/main/17main23&more=2011/nov/17/main/main&date=11/17/2011
No comments:
Post a Comment