దేవరకొండ, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్ నాగూరావు నాగోజీ అన్నారు. బుధవారం దేవరకొండకు వచ్చిన సందర్భంగా మండల పరిధిలోని గాజీనగర్‌లో పార్టీజెండాను ఆవిష్కరించారు. అనంతరం దేవరకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సకలజనుల సమ్మె ద్వారా తెలంగాణ ఉద్యమంలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైందన్నారు. సకలజనులు సమ్మె చేయడం ద్వారా తమ సత్తాను కేంద్రానికి చాటినట్లైందని పేర్కొన్నారు. అద్వానీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయడంతో ప్రధానమంత్రి కూడా స్పందించి అనుకూలంగా అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ముందుంటుందని, అధికారంలోకి రాగానే వంద రోజుల్లో తెలంగాణ ఇచ్చి తీరుతామని పేర్కొన్నారు.
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ కోసం చేపట్టిన దీక్షను స్వాగతిస్తున్నామని, అయితే ఆయన గాంధీభవన్ ఎదుటనో సోనియాగాంధీ ఇంటి ఎదుటనో దీక్ష చేపడితే ఫలితం మరింత త్వరగా వస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు ప్రజాసమస్యల పరిష్కారంలో పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. సీఎం కిర ణ్‌కుమార్‌రెడ్డి పోలీసుపాలన సాగిస్తూ రాష్ట్ర సంక్షేమాన్ని గాలికొదిలేశారన్నారు. రాజీవ్ యువకిరణాల పేరిట యువతను మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో బీజేపీ నాయకులు వనం పుష్పలత, బెజవాడ శేఖర్, నక్క వెంకటేష్‌యాదవ్, నేతాళ్ల వెంకటేష్‌యాదవ్, పొట్ట చెన్నయ్య, వనం జగదీశ్వర్, వస్కుల సుధాకర్, నిరంజన్ పాల్గొన్నారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=259919&subcatid=8&Categoryid=3

No comments:
Post a Comment