Saturday, November 19, 2011

అదో ఎన్నికల స్టంట్! - యుపి విభజన ప్రతిపాదనపై ఎస్‌కె మోడీ

పాట్నా, నవంబర్ 17: ఉత్తరప్రదేశ్‌ను నాలుగు ముక్కలుగా విడగొట్టాలన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి ప్రతిపాదన ఎన్నికల స్టంట్ మాత్రమేనని, ఎందుకంటే ఈ ఆలోచన చేసిన మాయావతికి ఆ విషయంలో చిత్తశుద్ధి లేదని బీహార్ ఉప ముఖ్యమంత్రి ఎస్‌కె మోడీ గురువారం ఇక్కడ చెప్పారు.

‘ఇది ఎన్నికల స్టంట్ తప్ప మరోటి కాదు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతికి ఈ విషయంలో చిత్తశుద్ధి ఉండి ఉంటే నాలుగేళ్ల క్రితమే రాష్ట్ర విభజన కోసం తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి ఉండేవారు’ అని మోడీ అన్నారు.

బిజెపి చిన్న రాష్ట్రాలను సమర్థిస్తోంది కానీ ఆర్థిక స్వావలంబన లేకుండా ఆ పని చేయరాదని రాష్ట్రంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడైన మోడీ అంటూ, బీహార్‌ను విడగొట్టి మిథిలాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు. ‘బీహార్ రాష్ట్రాన్ని ఒకసారి ఇప్పటికే విడగొట్టి జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు. ఇప్పుడు మరోసారి రాష్ట్రాన్ని విడగొట్టాల్సిన అవసరం లేదు’ అని మోడీ స్పష్టం చేసారు.

http://www.andhrabhoomi.net/national/q-065

No comments:

Post a Comment