మాజీ టెలికం మంత్రి రాజా, డిఎంకె ఎంపి కనిమొళి, ఇతర కార్పొరేట్ అధికారులతో సహా 17 మందిపై 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం వ్యవహారంలో శనివారం ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి, అధికారులు, ఎంపి, ఇతర కంపెనీల అధికారులపై చార్జిషీట్ దాఖలు చేయడం ఆహ్వానించదగిన పరిణామం. ఈ వ్యవహారంలో ఇంకా కొంత మంది కీలక వ్యక్తులను దర్యాప్తులోకి చేర్చలేదన్న అనుమానాలు కలుగుతున్నాయి’ అని అద్వానీ అన్నారు.
‘ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు జరిగినా అప్పట్లో అధికారంలో ఉన్న హోం మంత్రి పి.చిదంబరం పాత్రపై సమగ్ర దర్యాప్తు జరగాలి’ అని ఆయన చెప్పారు. ‘అప్పటి వేలం విధానాన్ని మార్చేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖను ఏ పరిస్థితులు ప్రోత్సహించాలన్న విషయం ఇంకా వీడని మిస్టరీగా ఉంది’ అని అద్వానీ వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాలపై దర్యాప్తు చేస్తున్న సంస్థల పరిధిలోకి ఆర్థిక మంత్రిత్వ శాఖలో పని చేసిన అప్పటి అధికారులను కూడా చేర్చాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి నిరోధానికి యుపిఎ ప్రభుత్వం సరైన విధానాన్ని రూపొందించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. వరుస కుంభకోణాల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్ధ్యం యుపిఎ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రధాని నాయకత్వం ప్రశ్నార్దకంగా మారిందని ఆయన చెప్పారు. ‘అవినీతి కాన్సర్‌లా విస్తరించి మన పౌరసమాజాన్ని కబళించివేస్తోంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాధనాన్ని ఇలా నేతలు స్వాహా చేయడం వల్లే ద్రవ్యోల్బణం పెరిగిపోడానికి కారణమవుతోందని ఆయన చెప్పారు. మనదేశం నుంచి నల్లధనం ప్రవాహంలో విదేశాలకు తరలిపోతూ, స్విస్ బ్యాంక్‌తో సహా పన్నులు లేని దేశాలలో కులుకుతోందని ఆయన తెలిపారు. 2009లోనే ఈ అంశంపై నేను ప్రస్తావించినా యుపిఎ ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపలేదని ఆయన ధ్వజమెత్తారు. (చిత్రం) జన చేతన యాత్రలో భాగంగా ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని సరైపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ. చిత్రంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, తదితరులు
http://www.andhrabhoomi.net/national/advani-671
No comments:
Post a Comment