Saturday, October 15, 2011

తన ఉనికిని కాపాడుకొనేందుకు కాంగ్రెస్ ఆడుతున్న ప్రమాదకర అట - మత పరమైన రిజర్వేషన్లు

Source : http://www.lokahitham.net/2011/10/blog-post_8337.html#more

మతపమైన రిజర్వేషన్లు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకం. వందల సంవత్సరాలుగా సమాజంలో వివక్షకు గురైన వారిని మిగతా సమాజంతో పాటు అభివృద్ధి చేయాలనే ఉన్నత లక్ష్యంతో రిజర్వేషన్లు ఏర్పాటు చేయబడినవి. ఆ లక్ష్యాన్ని విస్మరించి, తమ రాజకీయ అవసరాలకు తగిన విధంగా రిజర్వేషన్లను ఉపయోగించుకోవాలని రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలు కూడా రాజ్యాంగ నిర్దేశానికి విరుద్ధంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనలో ఉంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలకు మాత్రమే ఇవ్వదలచుకున్నాము, అందరికీ కాదు అనేది ప్రభుత్వ వాదన. అయితే బీసీ కోటాలో వెనుకబడిన ముస్లింలకు ఇప్పటికే రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. దానిని పెంచవచ్చు కదా! రాజకీయ నాయకులూ అందుకు సిద్ధంగా లేరు. ఉన్నవి పోకుండా కొత్తవి ఎలా సాధించుకోవాలా అని నాయకుల ఆలోచన.

మతపరమైన రిజర్వేషన్లు మతపరమైన నియోజక వర్గాల ఏర్పాటుకు దారి తీయవా? దాని వలన జాతీయ సమైక్యతకు భంగకరం కాదా?

2012 సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. పేరు పొందిన రాజకీయ పార్టీలన్నిటికీ తమ భవిష్యత్తు ఆ ఎన్నికల ఫలితాల పైనే ఆధారపడి ఉన్నదని తెలుసు. అందుకే కాంగ్రెస్ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది.

సచార్ కమిటీ నివేదిక ఆధారంగా ముస్లింల కోసం అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. వాళ్ళ రక్షణ కోసం మతపరమైన హింసను నిరోధించేందుకు ఒక చట్టం చేయబోతున్నది.

దళితులకు ఇచ్చే రిజర్వేషన్లు దళిత క్రైస్తవులకూ వర్తింపచేసేందుకు ప్రయత్నం చేస్తున్నది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కూడా ముస్లింలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించే ఆలోచన చేస్తోంది. మొత్తం మీద దేశంలోని కాంగ్రెస్ ను చూసి మిగతా పార్టీలు కూడా ఈ మత రిజర్వేషన్ల పాచికను ఉపయోగిస్తున్నాయి. ఇవి దేశ ప్రజల్లో విబేధాలు నిర్మాణం చేసేందుకు దారి తీస్తాయి. ఏమైనా రాజకీయ నాయకులకు స్వప్రయోజనాలే ముఖ్యం.

No comments:

Post a Comment