Saturday, October 15, 2011

వాణిజ్య చక్రబంధం నుండి భారత్ బయట పడగలదా ?

Source : http://www.lokahitham.net/2011/10/blog-post_3516.html#more

ఘనత వహించిన మన ప్రధానమంత్రి గారు ఈ మధ్య ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ప్రసంగిస్తూ ఈ రోజున ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం గురించి విశ్లేషించారు. "

ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) వల్ల అన్ని దేశాలకూ ఆర్ధిక ప్రయోజనాలు సిద్ధిస్తాయని గడచిన కొద్ది సంవత్సరాలుగా అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆ ఆలోచన సరియైనది కాదని అర్ధం చేయిస్తున్నాయి. ప్రపంచీకరణ కారణంగా తలెత్తుతున్న సమస్యలు కేవలం ఆర్ధిక పరమైనవి మాత్రమే కాదు. ఆర్ధిక, సామాజిక, రాజకీయ వైపరీత్యాలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ విడివిడిగా కాక కలిసి పెరుగుతున్నాయి. వీటికి పరిష్కార మార్గాలు వెతకాలి" అని సూచించారు. ఆ రోజుల్లో ప్రపంచీకరణను సమర్ధించిన వారిలో మన ప్రధాని కూడా ప్రముఖుడే. ఇప్పటికైనా మన ప్రదానిగారికి జ్ఞానోదయం కలిగినందుకు మనందరం సంతోషించాలి. అంతర్జాతీయ వేదికల మీదైతే ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారు. కానీ వ్యవహారంలో మాత్రం వారు చేస్తున్నది వేరుగా ఉంది. రోజువారీ చిల్లర వ్యాపారాలు చేసుకుంటూ ప్రభుత్వానికి భారం కాకుండా తమ పొట్టను తాము పోషించుకుంటూ, అభిమానంతో గౌరవంగా బ్రతుకుతున్న వారిని బజారులో పడేసేందుకు ఆ వ్యాపారాల్లో విదేశీయుల పెట్టుబడులను మన ప్రధాని ఆహ్వానిచారు. ఒకప్పుడు భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ అనే బహుళ జాతి కంపెనీ ఉండేది. ఈ రోజున అనేక కంపెనీలు దేశం అంతటా కనిపిస్తున్నాయి. ఈ మహత్కార్యానికి తెర లేపింది మన ప్రధానిగారే. ఇప్పుడేమో వాటి దుష్ఫలితాల గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థల చక్రబంధం నుండి మన దేశాన్ని తప్పించేందుకు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 

No comments:

Post a Comment