తిరువనంతపురం:
అవినీతి కేసుల్లో కాంగ్రెస్ తన భాగస్వామ్య పక్షాలనే బలిపశువులుగా చేస్తోందని, కుంభకోణాల్లో సొంత మంత్రులపై మాత్రం దర్యాప్తు జరిపించడం లేదని బీజేపీ నేత అద్వానీ ఆరోపించారు. జన చేతన యాత్రలో భాగంగా శనివారం కేరళలోని కొల్లాం జిల్లా కొట్టరక్కర సభలో ఆయన ప్రసంగించారు. అవినీతికి పాల్పడుతూ, అవినీతిని వెనకేసుకొస్తూ యూపీఏ ప్రభుత్వం భారత పరువు ప్రతిష్టలను మంటగలిపిందని ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, హోంమంత్రి చిదంబరంల మధ్య విభేదాలు బయటపడటం మినహా సమాచార హక్కు చట్టాన్ని మార్చాల్సిన కారణమేదీ తనకు కనిపించడం లేదన్నారు.
ఇదిలాఉండగా, తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయ సంపద పరిరక్షణలో సంప్రదాయాన్ని పాటించాలని అద్వానీ చెప్పారు. ట్రావెన్‌కోర్ రాచకుటుంబం అపార సంపదను శతాబ్దాలుగా కాపాడుతుండటం గొప్ప విషయమన్నారు. ఇదిలా ఉండగా, వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అద్వానీ తెలిపారు. మరోవైపు, అద్వానీ యాత్ర మార్గంలో పోలీసులు పైపుబాంబును కనుగొన్న సంఘటనపై త్వరితగతిన దర్యాప్తు సాగించి, బాధ్యులను చట్టం ముందుకు తేవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాలు జారీ చేశారు. పైపుబాంబు కుట్రను భగ్నం చేసిన పోలీసులను అద్వానీ ప్రశంసించారు.
నేడు బెంగళూరులో అద్వానీ యాత్ర
బెంగళూరు, న్యూస్‌లైన్: విపక్షాల నిరసనల నడుమ అద్వానీ యాత్ర ఆదివారం బెంగళూరులో ప్రవేశించనుం ది. సాయంత్రం ఐదు గంటలకు నేషనల్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పా ల్గొంటారు.
No comments:
Post a Comment