Monday, October 31, 2011

శాసనసభలో కరువుపై చర్చించాలి - కిషన్‌రెడ్డి

అనంతపురం , అక్టోబర్ 30 : కరువు పరిస్థితుల నేపథ్యంలో శాసనసభను వెంటనే సమావేశపరచాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ శాసనసభను వెంటనే సమావేశరపరచి కరువుపై చర్చించాలన్నారు. కరువు మండలాల్లోని రైతులను ఆదుకునేందుకు శాశ్వత ప్రాతిపదిక న ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పంటనష్టపోయిన రైతులకు పూర్తి నష్టపరిహారం అందించాలన్నారు.

రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ను సరఫరా చేస్తామని ప్రకటిస్తున్నా అమలుచేయడంలో విఫలమయ్యారనిధ్వజమెత్తారు. పోలవరం టెండర్లు రద్దుచేసి సీబీ ఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ,టీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతూ రాజకీయాలను దిగజారుస్తున్నారన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి అక్రమాలు రుజువైతే పార్టీ నుంచి పార్టీ అధిష్ఠానం ఆయన్ను బహిష్కరిస్తుందని స్పష్టం చేశారు. 

 https://www.andhrajyothy.com/stateNewsShow.asp?qry=2011/oct/31/state/31state13&more=2011/oct/31/state/statemain&date=10/31/2011

No comments:

Post a Comment