కుషినగర్ (ఉత్తరప్రదేశ్): అవినీతిపై ఉద్యమం కోసం అన్నా హజారే తమ పార్టీ మద్దతు కోరలేదని బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, జాతీయ ప్రయోజనం కోసం జరిపే ఏ పోరాటంలోనైనా వారితో ఉంటామని తెలిపారు. ‘హజారే మా పార్టీ సహకారం ఏనాడూ కోరలేదు. ఆయన పోరాటానికి నైతిక మద్దతు మాత్రమే ఉంటుంది. అది క్రియాశీలకం కాదు. దేశ ప్రయోజనం కోసం వ్యక్తులు కానీ లేదా సంస్థలు కానీ ఉద్యమం చేపడితే సహకారం అందించడానికి బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అని అన్నారు. దేశ ప్రయోజనం కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. హజారే చేపట్టిన ఉద్యమం వెనుక బీజేపీ, ఆరెస్సెస్‌ల హస్తముందని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=257475&Categoryid=1&subCatId=32 |
No comments:
Post a Comment