ఇతరుల అవినీతిని ఎత్తిచూపే ముందు మనం పరిశుద్ధులుగా ఉండాలని అద్వానీ పరోక్షంగా కర్ణాటక బీజేపీ నేతలకు చురకలంటించారు. ఆదివారం బెంగళూరు లోని నేషనల్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యూపీఏ సర్కారుపై విమర్శలు గుప్పించిన అద్వానీ, కర్ణాటకలోని బీజేపీ అవినీతిని కూడా ప్రస్తావించారు.
మన్మోహన్ ప్రధాని కాక మునుపు ఆయనపై తనకు అపార గౌరవముండేదన్నారు. అయితే, సర్కారును కాపాడుకునేందుకు ‘ఓట్లకు నోట్లు’ పంచడంతోనే తనకు ఆయనపై గౌరవం పోయిందన్నారు. యూపీఏ వంటి అవినీతి సర్కారును తానింతవరకూ చూడలేదని అద్వానీ విమర్శించారు.
No comments:
Post a Comment