Monday, October 31, 2011

తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలే నడిపిస్తారు - కిషన్‌రెడ్డి

అనంతపురం అక్టోబర్ 30: తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలే ముందుకు నడిపిస్తారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కుమ్మకై సకల జనుల సమ్మెను విరమింపజేశారని ఆరోపించారు. సమ్మె విరమించినంత మాత్రాన తెలంగాణ ఉద్యమం ఆగిపోతుందనుకోవడం పొరపాటేనన్నారు. కొంత విరామం తరువాత ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలే ముందుకు నడిపిస్తారని అన్నారు.

కెసిఆర్, చంద్రబాబునాయుడు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం జోగప్పను తలపిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయాలని చూస్తే రాష్టప్రతి పాలన వచ్చే అవకాశం ఉందన్నారు. నష్టపోయిన పంటలు, కరవుపై అసెంబ్లీని సమావేశ పరచి సమీక్షించాలన్నారు. గాలి జనార్థన్‌రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు రుజువైతే పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.



http://www.andhrabhoomi.net/state/prajale-nadipistaru-376

No comments:

Post a Comment