మదురై, అక్టోబర్ 28: వివిధ కుంభకోణాలతో సంబంధం ఉన్న వారిలో కొంతమందిని మాత్రమే ప్రభుత్వం టార్గెట్‌గా చేసుకుంటోందని బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ ఆరోపిస్తూ, అలా చేయడం ద్వారా ప్రభుత్వం దర్యాప్తులనుంచి తప్పించుకుంటూ తనను రక్షించుకుంటూ ఉందన్నారు. అవినీతి కుంభకోణాల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకుల పాత్రపైనా, కుంభకోణాల్లో వారి ప్రమేయంపైనా దర్యాప్తు జరిపించాలని ఆయన అన్నారు. ‘మిత్ర పక్షాలకు చెందిన చాలా మంది మంత్రులను శిక్షిస్తున్న అపభుత్వం తనను మాత్రం దర్యాప్తులనుంచి రక్షించుకుంటూ ఉంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులపైనా, ఈ కుంభకోణాల్లో వారి పాత్రపైనా దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్లు వస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆ డిమాండ్లను అంగీకరించడంలేదు’ అని అద్వానీ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన జన చేతన యాత్ర రెండో దశలో భాగంగా శుక్రవారం ఇక్కడికి వచ్చిన అద్వానీ విలేఖరులతో మాట్లాడారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గత రెండేళ్ల కాలంలో వరసగా కుంభకోణాలు వెలుగు చూసాయని, ఈ కుంభకోణాలతో సంబంధం ఉన్న కారణంగా చాలా మంది మత్రులను పదవులనుంచి తప్పించడమే కాకుండా తీహార్ జైల్లో పెట్టారని, ఇది తనకు చాలా ఆందోళన కలిగిస్తోందని అద్వానీ అన్నారు. ఓటుకు నోటు కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ, ఇది భారతీయ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోయిందని ఆయన అంటూ, డబ్బులు ఇచ్చిన వారిని శిక్షించడానికి బదులు, ఈ కుంభకోణం గురించి సమాచారం ఇచ్చిన వారిని శిక్షిస్తున్నారన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఆందోళన ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి ముందస్తువ్యూహమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, దిగ్విజయ్ లాంటి సీనియర్ నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం, ఆయన సొంతపార్టీయే ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్తూ ఉండడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కర్నాటకలో బిజెపి నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి విలేఖరులు ప్రశ్నించగా, తమ పార్టీలో అవినీతి విషయంలో ఎవరి పట్లా మెతగ్గా వ్యవహరించడం జరగదని అన్నారు. ‘లోకాయుక్త నివేదిక ఇచ్చిన తక్షణం యెడియూరప్పను పదవినుంచి తప్పుకోవాలని కోరామన్న విషయం అందరికీ తెలుసు. అవినీతి విషయంలో బిజెపిలో ఎవరి పట్లా మెతక వైఖరి లేదు’ అని అద్వానీ స్పష్టం చేసారు. కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, అప్రమత్తత అవసరమని, ప్రజల యోగక్షేమాలు అన్నిటికన్నా ముఖ్యమని అద్వానీ అన్నారు.
‘చాలాకాలంగా అణు విద్యుత్ ప్లాంట్లు కలిగి ఉన్న దేశాలతో సహా మొత్తం ప్రపంచ దేశాలు ఈ ప్లాంట్ల విషయంలో ముఖ్యంగా సముద్రానికి దగ్గర్లో ఉన్న ప్లాంట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నాయి. అలాంటప్పుడు మన దేశం మాత్రం అలాంటి ఆలోచన ఎందుకు చేయకూడదు?’ అని ఆయన ప్రశ్నించారు.
కోర్టు నిర్ణయాల్లో జోక్యం తగదు
రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించడంపై మాట్లాడుతూ రాజకీయ కారణాలతో కోర్టు నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం తగదన్నారు. ‘రాజీవ్ హంతకులు కానివ్వండి, పార్లమెంటుపై దాడి చేసిన వారే కానివ్వండి, కోర్టు నిర్ణయాల్లో రాజకీయ కారణాలపై జోక్యం చేసుకోవడం సరికాదు’ అని అద్వానీ అన్నారు. వ్యక్తుల విషయంలో క్షమాభిక్ష ప్రసాదించడం గురించి ఆలోచించవచ్చునేమో కానీ, రాజకీయ కారణాలతో జోక్యం చేసుకోవడం సరికాదని కూడా ఆయన అన్నారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఎత్తివేయాలన్న జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటనపై మాట్లాడుతూ, ఉగ్రవాదం విషయంలో వైఖరి ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి, అంతేకాని సమయానుకూలంగా అది మారుతూ ఉండరాదనేది మా ఉద్దేశం అని ఆయన అన్నారు.
http://www.andhrabhoomi.net/national/advani-demands-probe-793

No comments:
Post a Comment