Monday, October 31, 2011

అవినీతికూపంలో యూపీఏ - బెంగళూరులో అద్వానీ

బెంగళూరు, అక్టోబర్ 30: కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ హయాంలో జరిగినన్ని కుంభకోణాలు గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని ఆయన విమర్శించారు. జనచేతన యాత్రలో భాగంగా బెంగళూరులోని నేషనల్ కాలేజీ మైదానంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అద్వానీ ప్రసంగించారు.

తాను పండిట్ నెహ్రూ మొదలు ఇప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పరిపాలన దాకా అన్ని ప్రభుత్వాల పనితీరును గమనించానని చెప్పారు. అయితే యూపీఏ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మరే ప్రభుత్వంలోనూ లేదన్నారు. ప్రధాని కావడానికి ముందు మన్మోహన్‌సింగ్‌ను తానెంతో గౌరవించేవాడినని, ఇ ప్పుడు ఆ అభిప్రాయం మార్చుకోవాల్సి వస్తోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ చట్టానికి తూ ట్లు పొడవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అవినీతిపై తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి సదానందగౌడ, అగ్రనేతలు వెంకయ్యనాయుడు, అనంతకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. 

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/oct/31/national/31national5&more=2011/oct/31/national/nationalmain&date=10/31/2011

No comments:

Post a Comment