Saturday, October 22, 2011

ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పా?: అద్వానీ - ‘మన్మోహన్ బలహీన ప్రధాని’ అనడంలో పరుష పదజాలం ఏముంది?

ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పా?: అద్వానీ

‘మన్మోహన్ బలహీన ప్రధాని’ అనడంలో పరుష పదజాలం ఏముంది?



కోల్‌కతా: మన్మోహన్ సింగ్ బలహీన ప్రధాని అంటూ తాను తరచూ విమర్శలు చేయడాన్ని బీజేపీ అగ్రనేత అద్వానీ సమర్థించుకున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో తప్పేముందని ఆయన అన్నారు. ఒకవేళ తప్పే అయితే తాను నేరం అంగీకరిస్తానని చెప్పారు. జనచేతన యాత్రలో భాగంగా శుక్రవారం కోల్‌కతా చేరుకున్న అద్వానీ విలేకరులతో మాట్లాడారు. పరుష పదజాలం వాడరాదని మన్మోహన్ ఇటీవల తనకు చేసిన సూచనపై పైవిధంగా స్పందించారు.


‘జవహర్‌లాల్ నెహ్రూ హయాం నుంచి నేను చూసిన ప్రధానుల్లో అత్యంత బలహీనుడు మన్మోహనేనని అన్నాను. ఇది రాజకీయ విమర్శ మాత్రమే. ఇందులో పరుష పదజాలం ఏముంది?’ అని ప్రశ్నించారు. ‘పేరుకు మాత్రమే మన్మోహన్ యూపీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్నారు... అధికారాలన్నీ సోనియా గాంధీవే’ అని విమర్శించారు. యూపీఏ సర్కారు అవయవాలన్నీ చచ్చుబడిపోయి, అవసాన దశలో ఉన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

http://www.sakshi.com/main/Fullstory.aspx?CatId=253278&Categoryid=1&subCatId=32

No comments:

Post a Comment