Friday, October 7, 2011

డాక్టర్ రమణసింగ్ కు కృషి కర్మ పురస్కారం

Dr Raman Singh

భాజపా పాలిత రాష్ట్రాలను, భాజపాను ఏదో విధంగా అప్రతిష్టపాలు చేయాలని ఎంతగా ప్రయత్నిస్తారో అంతగా భాజపా ముఖ్యమంత్రులు కీర్తి సంపాదిస్తారు.  చత్తీస్ ఘడ్ వెనుకపడిన ప్రాంతం ఐనప్పటికీ 2010 - 2011 సంవత్సరానికి గాను 'దేశంలోనే అతి ఎక్కువ బియ్యం ఉత్పత్తి' చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరంలో 61.59 మెట్రిక్ టన్నుల బియ్యం పండించి ఒక క్రొత్త రికార్డ్ నెలకొల్పింది. 


ఇంకొక విశేషం కూడా ఉంది.  క్రితం సంవత్సరంతో పోలిస్తే 2010 - 11 సంవత్సరంలో దిగుబడి రెట్టింపు (రెండింతలు) సాధించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి సంస్థ వ్యవస్థాపక దినం సందర్భంగా 2011  జూలై 16 నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా శ్రీ రమణ సింగ్ "కృషి కర్మ" పురస్కారం, ఒక కోటి రూపాయల నగదు బహుమతి అందుకున్నారు. 

 Source : http://www.lokahitham.net/2011/09/blog-post_761.html

No comments:

Post a Comment