ఎన్‌డీసీలో రాజకీయ దుమారం
న్యూఢిల్లీ: యూపీఏ తర (కాంగ్రెసేతర) పక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రం ప్రభుత్వం తమపట్ల అనుసరిస్తున్న విధానాల్ని శనివారం ఇక్కడ జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో విమర్శించాయి. కేంద్రం విధానం ఫెడరల్ వ్యవస్థనే బలహీన పరిచేదిగా ఉందని, అది రాష్ట్రాలను తనతో సమాన భాగస్వాము లుగా చూడడం లేదని, అసలు భాగస్వాములుగా గుర్తించడం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ దుయ్యబట్టారు. ‘రాజ్యాంగం ఆదేశించిన ఫెడరల్ వ్యవస్థను తారుమారు చేసేందుకు కేంద్రం తరచు ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం ఫెడరల్ ధర్మాన్ని పాటించాలి’ అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సలహా ఇచ్చారు.రాజకీయాలకు అతీతంగా వెనకబడిన ప్రాంతాలను త్వరితగతిన అభివృద్ధి చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి చెప్పారు. 11వ ప్రణాళికలో వృద్ధి లక్ష్యాలను సాధించలేదన్నారు. అభివృద్ధిలో సమతుల్యత అవసరమని, అట్టడుగు వర్గాల్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావాలని మాయావతి కోరారు. ధరల నియంత్రణలో కేంద్రం వైఫల్యాన్ని ముఖ్యమంత్రులు ఎండగట్టారు. ధరలరంగంలో కేంద్రం విధానాలు విఫలమయ్యాయని మోడీ అన్నారు.
రాష్ట్రాల ప్రణాళిక వాటా ఆధారంగా కేంద్ర ప్రణాళికలో బడ్జెట్ బలపడుతోందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అన్నారు. కేంద్రం అభివృద్ధి విధానం ప్రాంతాలమధ్య అంతరాల్ని పెంచుతోందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆరోపించారు. కేంద్రం జాతీయ పథకాల్లో తమపట్ల వివక్ష ప్రదర్శిస్తోందని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్‌సింగ్ బాదల్ ఆందోళన వ్యక్తం చేశారు.
http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=3&ContentId=53445
No comments:
Post a Comment