Tuesday, October 25, 2011

ఆయుధ చట్టం ఉపసంహరణ తప్పు - బిజెపి


జమ్మూ, అక్టోబర్ 24: భద్రతాకారణాల రీత్యా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సాయుధ బలగాల ప్రత్యేక ఆయుధ చట్టం(ఎఎఫ్‌ఎస్‌పిఎ)ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించడం పట్ల బిజెపి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జమ్మూకాశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షంషేర్ సింగ్ మన్హాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎఎఫ్‌ఎస్‌పిఎ చట్టం ఎత్తివేయాలనే ప్రభుత్వం నిర్ణయం ఘోరమైన తప్పిదమని ఆయన అన్నారు. కాశ్మీర్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతునే ఉన్నాయని ఆయన చెప్పారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై నవంబర్ 2 నుంచి ఉద్యమించనున్నట్టు ఆయన వెల్లడించారు. పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ఉద్యమబాటలో నడుపుతామని ఆయన అన్నారు.

http://www.andhrabhoomi.net/national/jammu-081

No comments:

Post a Comment