న్యూఢిల్లీ: అవినీతిపై నమోదైన కేసుల విచారణను అడ్డుకుని రాజకీయ నేతలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సర్వత్రా అభిప్రాయం బలపడుతోందని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ మురళీ మనోహర్ జోషి పేర్కొన్నారు.
పీఏసీ, కోర్టులు, ఇతర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న విచారణలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తనతోపాటు అంతా భావిస్తున్నారని సీఎన్‌ఎన్-ఐబీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాగ్ నిర్ణయాలను న్యాయశాఖ పంపిన ఓ నోట్‌లో ప్రశ్నించటాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయాలను సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించలేదని న్యాయశాఖ పేర్కొన్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. అయితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పద్దులను తనిఖీ చేయాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత కాగ్‌పై ఉందని, తప్పులను క్షుణ్నంగా శోధించటమే కాగ్ విధి అని స్పష్టం చేశారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=254823&Categoryid=1&subCatId=32
No comments:
Post a Comment