Sunday, October 23, 2011

వ్యవసాయాన్ని నాశనం చేసిన ప్రభుత్వం - బిజెపి రాష్ట్ర శాఖ ధ్వజం



హైదరాబాద్, అక్టోబర్ 22: రాష్ట్రంలో వ్యవసాయాన్ని దండగమారి వ్యవహారంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చేసిందని బిజెపి రాష్టక్రార్యవర్గం వ్యాఖ్యానించింది. రెండు రోజుల పాటు జరిగిన కార్యవర్గ సమావేశాల సందర్భంగా వ్యవసాయ రంగం పరిస్థితులపై తీర్మానాన్ని బిజెపి ఆమోదించింది. తీర్మాన అంశాలను ఆ పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ శనివారం నాడు పాత్రికేయులకు వివరించారు.

వ్యవసాయాన్ని ప్రభుత్వం నాశనం చేసిందని అన్నారు. విత్తన ఉత్పత్తిలో రైతులను భాగస్వామ్యులను చేసి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించేలా చర్యలు చేపట్టాలని, విత్తన ఉత్పత్తి , పంపిణీ సమయంలో రైతులకు సబ్సిడీ అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సబ్సిడీని దారి మళ్లించిన అధికారులపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని, వేసవి లోపు రైతు కమతంలో భూసార పరీక్షలను నిర్వహించి ఫలితాలను రైతులకు అందించాలని రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది.

రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను అందించి, గుజరాత్ ప్రభుత్వం తరహాలో మొబైల్ భూసార పరీక్షల కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలో భూసార పరీక్షలను నిర్వహించి రైతులకు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ విషయంలో పాత విధానానే్న అనుసరించాలని, ఎరువుల ధరలు తగ్గించి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పంట బీమా పథకం వర్తించేలా ప్రభుత్వం విధివిధానాలను రూపొందించాలని, 90 రోజుల్లో రైతుకు బీమా పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ కోరారు. రాష్ట్రంలో కేవలం 50 శాతం భూమి చిన్న రైతులకు మాత్రమే పంట రుణాలు అందుతున్న పరిస్థితుల్లో రైతులందరికీ పంట రుణాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఎంత మంది రైతులకు రుణాలు అందుతున్నదీ ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని తీర్మానించినట్టు ఆయన చెప్పారు.
వ్యవసాయానికి విద్యుత్ ఖచ్చితంగా ఏడు గంటలు అందించి పంటలు నష్టపోకుండా చూడాలని, వ్యవసాయం కోసం అవసరమైన మేరకు విద్యుత్ కొనుగోలు చేసి పంటలు కాపాడాలని దత్తాత్రేయ పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల పరిమాణం ఉన్న గోదాముల నిర్మాణం వెంటనే చేపట్టాలని, రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని అన్నారు. మార్కెట్ యార్డుల ఆదాయాన్ని రైతుల ప్రయోజనాలకే ఖర్చు చేయాలని, యార్డుల్లో కమిషన్ పొందుతున్న దళారులను తొలగించాలని , రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా బడ్జెట్‌లో తగిన నిధులను కేటాయించాలని పేర్కొన్నారు.

రైతు బృందాల పర్యటన

15 జిల్లాల్లో ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకూ బిజెపి బృందాలు పర్యటించి కరవు, రైతాంగ పరిస్థితులను అధ్యయనం చేస్తుందని బండారు దత్తాత్రేయ తెలిపారు. బృందాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్రంలో పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు.

http://www.andhrabhoomi.net/state/bjp-rashtra-shaka-493

No comments:

Post a Comment