Tuesday, October 25, 2011

కాంగ్రెసేతర రాష్ట్రాల పట్ల వివక్షతో.. ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు! - యుపిఎ సర్కారుపై అద్వానీ ధ్వజం

సంబల్‌పూర్ (ఒరిస్సా), అక్టోబర్ 24: కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతూ ఫెడరల్ రాజ్యాంగ ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తోందని బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ ధ్వజమెత్తారు. అవినీతికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలో భాగంగా ఆయన సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంలో తలమునకలైన యుపిఎ సర్కారు కాంగ్రెస్ యేతర పాలిత రాష్ట్రాలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతోంది.

అధికార మదం తలకెక్కించుకుని అడ్డగోలుగా అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్న యుపిఎ సర్కారు బిజెపి పాలిత రాష్ట్రాలను వేధించేందుకు తింటోంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఈ వేధింపులు మరీ మితిమీరిపోయాయి. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కనుసన్నల్లోనే ఈ తంతు కొనసాగుతోంది’ అని ఈ అద్వానీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ సర్కారు అనుసరిస్తున్న ఈ వివక్షాపూరిత వైఖరిపై వివిధ రాష్ట్రాలు గత వారం జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో తీవ్ర నిరసనను వ్యక్తంచేసి ప్రధాన మంత్రిని నిలదీశాయని ఆయన అన్నారు. ‘గత వారం జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపై నిరసనను వ్యక్తం చేసేందుకు కాంగ్రెస్ యేతర రాష్ట్ర ప్రభుత్వాలకు వేదికగా మారింది. కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాలను తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమావేశంలో ఎండగట్టారు. చివరకు యుపిఎలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తీస్తా జలాల పంపకం విషయమై తాము లేకుండానే కేంద్రం బంగ్లాదేశ్‌తో సంప్రదింపులు జరపడంపై ఈ సమావేశంలో ఫిర్యాదు చేశారు’ అని అద్వానీ అన్నారు.

http://www.andhrabhoomi.net/national/advani-083

No comments:

Post a Comment